Jamuna Biopic - హీరోయిన్ ఎవరు?

Saturday,March 13,2021 - 01:15 by Z_CLU

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సావిత్రి తర్వాత ఆ స్థాయిలో పేరుతెచ్చుకున్న నటి జమున. సావిత్రి బయోపిక్ మహానటి పేరిట వచ్చింది. మరి జమున బయోపిక్ వస్తుందా? దీనికి ఇప్పుడిప్పుడే ఓ సమాధానం షేప్ తీసుకుంటోంది.

Tamanna

జమున బయోపిక్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్టార్ హీరోయిన్ తమన్న ఈ బయోపిక్ లో జమునగా నటించే అవకాశం ఉంది. రీసెంట్ గా దేవినేని అనే సినిమాను తీసిన శివనాగు, ఈ బయోపిక్ ను డైరక్ట్ చేసే ఛాన్స్ ఉంది. స్క్రిప్ట్ వర్క్ లో భాగంగా జమునను ఇప్పటికే కలిసి ఆమె అంగీకారం పొందాడట శివనాగు.

Tamanna

Tamanna Stills తమన్న

అప్పట్లో డాన్స్ అంటే జమున. ఆమె అందంగా డాన్స్ చేసేవారు. పైగా ఆమె కళ్లల్లో ఓ చిన్న పొగరు కనిపించేది. ఆ లక్షణాలన్నీ తమన్నాలో ఉన్నాయని భావిస్తున్నాడు శివనాగు.

Tamannaah_Stills_ZeeCinemalu

గతంలో జమున-ఏఎన్నార్-ఎన్టీఆర్ మధ్య వివాదం చెలరేగింది. చాన్నాళ్ల పాటు వాళ్లిద్దరితో కలిసి సినిమాలు చేయలేదు జమున. చివరికి నాగిరెడ్డి-చక్రపాణి సయోధ్య కుదర్చడంతో గుండమ్మకథ సినిమా చేశారు జమున.