తమన్న రెండున్నర కోట్లు డిమాండ్ చేసిందా!

Thursday,May 21,2020 - 02:27 by Z_CLU

“ఈ లాక్ డౌన్ టైమ్ లో హీరోహీరోయిన్లంతా తమ రెమ్యూనరేషన్స్ తగ్గించుకుంటుంటే.. తమన్న మాత్రం ఓ సినిమాకు ఏకంగా రెండున్నర కోట్లు డిమాండ్ చేసిందట.”

టాలీవుడ్ లో 2 రోజులుగా వినిపిస్తున్న రూమర్ ఇది. పీపుల్ మీడియా బ్యానర్ పై రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రాబోతున్న సినిమా కోసం హీరోయిన్ గా మిల్కీబ్యూటీని సంప్రదించారు. ఈ సినిమాలో నటించడానికి ఆమె 2 కోట్ల 50 లక్షలు డిమాండ్ చేసిందనేది రూమర్. దీన్ని తమన్న ఖండించింది.

“నా పారితోషికంపై వస్తున్న గాసిప్స్ లో ఎలాంటి నిజం లేదు. ఆ ప్రొడక్షన్ హౌజ్ ఇంకా నా మేనేజర్ తో టచ్ లోనే ఉంది. ఆ సినిమాపై ఫిబ్రవరిలోనే డిస్కషన్ స్టార్ట్ అయినప్పటికీ లాక్ డౌన్ వల్ల చర్చలన్నీ ఆగిపోయాయి. నేను చాలా ప్రొఫెషనల్ గా ఉంటాను. ఇలాంటి రూమర్లు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. రవితేజ ఛాన్స్ ఇవ్వాలే కానీ అతడితో మరో 10 సినిమాలు చేస్తా.”

ఇలా తనపై వచ్చిన రూమర్లపై క్లారిటీ ఇచ్చింది తమన్న. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ గోపీచంద్ సరసన సీటీమార్ అనే సినిమాలో నటిస్తోంది.