టాక్ ఆఫ్ ది టౌన్‌: భేతాళుడు

Sunday,November 27,2016 - 12:45 by Z_CLU

గతేడాది తెలుగు సినిమా మార్కెట్లోకి సునామీలా దూసుకొచ్చి సరికొత్త సంచలనాలను సృష్టించిన హీరో విజ‌య్ ఆంటోని. డా.సలీం, నకిలీ  సినిమాలతో విభిన్న చిత్రాల హీరోగా  పేరు తెచ్చుకున్న విజయ్ , బిచ్చ‌గాడు తో  స్టార్ డమ్ అందుకున్నాడు. ఓ వైపు సంగీత ద‌ర్శ‌కుడిగా బిజీగా ఉంటూనే హీరోగా త‌న‌ని తాను సరికొత్తగా ఆవిష్క‌రించుకున్న ఆంటోని .. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ మార్కెట్లో హాట్ టాపిక్‌ గా మారిపొయాడు. అత‌డు న‌టించిన సినిమా వ‌స్తోంది అంటేనే అదో అటెన్షన్.

bethaludu-1

`బిచ్చ‌గాడు` చిత్రంతో సంచ‌ల‌న విజ‌యం అందుకున్న విజ‌య్ ఆంటోని ఎంచుకునే క‌థ‌ల్లో సంథింగ్ స్పెషాలిటి ఆడియెన్‌కి విప‌రీతంగా న‌చ్చుతోంది. మరొపక్క అత‌డు త‌న‌కు తానే ఓ బ్రాండ్‌గా ఆవిష్క‌రించుకున్న తీరు మార్కెట్ వ‌ర్గాల‌కు న‌చ్చుతోంది. అందుకే విజయ్  న‌టించిన `భేతాళుడు` చిత్రానికి త‌మిళ్‌, తెలుగు మార్కెట్ల‌లో అసాధార‌ణ క్రేజు నెల‌కొంది. అస‌లు ఆంటోని ఓ సినిమాలో న‌టిస్తున్నాడు అంటేనే బ‌య్య‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్లు ఫ్యాన్సీ ఎమోంట్ లను ఆఫర్ చెస్తున్నారంటే  అతిశ‌యోక్తి కకాదు. భేతాళుడు ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్లు, ట్రైల‌ర్స్ తో పాటు తొలి 10 నిమిషాల సినిమాని కూడా ఆడియెన్స్ కు ముందుగానే చూపించాడంటేనే విజయ్ ఈ సినిమా విజయం పై ఎంత కాన్పిడెన్స్ తో ఉన్నాడో అర్దం చేసుకోవచ్చు. డిసెంబర్ 2న భేతాళుడు మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.