NTR సినిమాలో కీ రోల్ ప్లే చేయనున్న టాబూ...?

Friday,November 03,2017 - 05:53 by Z_CLU

NTR త్రివిక్రమ్ సినిమా ఫాస్ట్ పేజ్ లో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాతో బిజీగా ఉన్న త్రివిక్రమ్, ఆ సినిమాకి ప్యాకప్ చెప్పీ చెప్పగానే NTR సినిమాతో సెట్స్ పైకి రానున్నాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో టాబూ ఓ కీలక పాత్ర పోషించనుందనే న్యూస్ టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ టాపిక్ లా మారింది.

గతంలో త్రివిక్రమ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాతో పాటు ‘అ..ఆ…’ సినిమాల్లో సీనియర్ హీరోయిన్ నదియాతో  సిల్వర్ స్క్రీన్ పై ఇమోషనల్ మ్యాజిక్ ని జెనెరేట్ చేశాడు త్రివిక్రమ్. అయితే ఇప్పుడు NTR సినిమాలోను ఇలాంటి క్యారెక్టర్ ఉండబోతుందని, ఈ క్యారెక్టర్ కోసం టాబూని కన్సిడర్ చేస్తున్నారనే టాక్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

ఈ న్యూస్ ఎంతవరకు జెన్యూన్ అనేది ప్రస్తుతానికి సినిమా యూనిట్ నుండి కన్ఫర్మేషన్ లాంటివైతే రాలేదు కానీ, ఈ గాసిప్ నిజమైతే బావుండు అనే ఫీలింగ్ ఫ్యాన్స్ లో మాత్రం గట్టిగా ఉంది. మరి త్రివిక్రమ్ అండ్ టీమ్ మైండ్ లో ఏం నడుస్తుందో ఇంకొన్ని రోజులు ఆగితే కానీ క్లారిటీ రాదు.