టబు ఫస్ట్ లుక్.. మరింత గ్లామరస్ గా...!

Monday,November 04,2019 - 11:48 by Z_CLU

అల వైకుంఠపురములో సినిమాకు సంబంధించి చాలా బజ్ నడుస్తోంది. ఇప్పటికే విడుదలైన 2 పాటలు సూపర్ డూపర్ హిట్టయ్యాయి. మరోవైపు మూవీ స్టిల్స్ తో బన్నీ అదరగొడుతున్నాడు. ఇదే ఊపులో ఈరోజు టబు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఈరోజు టబు బర్త్ డే. ఈ సందర్భంగా అల వైకుంఠపురములో ఆమె నటిస్తున్న క్యారెక్టర్ స్టిల్ ను రిలీజ్ చేశారు.

ఇన్నేళ్లయినా టబులో గ్లామర్ ఏమాత్రం చెక్కుచెదరలేదన్నట్టుగా ఉంది ఫస్ట్ లుక్. ఆ స్మైల్, ఆ లుక్స్ ఒకప్పటి టబును మనకు గుర్తుచేస్తాయి. సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు టబు. మూవీకి సంబంధించి ఆమె క్యారెక్టర్ ఏంటనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు.

వెంకటేశ్ హీరోగా వచ్చిన ‘కూలీ నెం.1’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది టబు. ఆ తర్వాత నాగార్జునతో ‘నిన్నే పెళ్లాడుతా’ సినిమాతో తెలుగు వారికి దగ్గరైంది. తెలుగు కంటే హిందీలో చాలా సినిమాలు చేసిన టబు.. లాంగ్ గ్యాప్ తర్వాత పాండురంగడు సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకొని ఇప్పుడు త్రివిక్రమ్ డైరక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.