Taapsee - టాప్-10 ప్రశ్నలు-సమాధానాలు

Tuesday,July 13,2021 - 12:36 by Z_CLU

– స్ఫూర్తినిచ్చే జంతువు
సింహం. నాది అదే రాశి. నాకు స్ఫూర్తి కూడా అదే. సమస్యల నుంచి నేను పారిపోను.

– ఇష్టమైన వంటకం
ఛోలే భాతూర్

– ఇష్టమైన ప్లేస్
నా ఇల్లు. ఖాళీ టైమ్ దొరికితే ఇంట్లోనే. చెల్లెలతో టైమ్ ఎక్కువగా గడుపుతాను. మా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. కలిసి సినిమాలు చూస్తాం, తింటాం.

taapsee

హీరోయిన్ తాప్సి

– షూటింగ్స్ కాకుండా ఉదయాన్నే ఎందుకు లేవాలనిపిస్తుంది?
నాకు సూర్యోదయాలంటే ఇష్టం. అందుకే షూటింగ్స్ లేకపోయినా ఉదయాన్నే లేస్తాను. పొద్దున్నే సన్ రైజ్ చూస్తే ఆ రోజంతా చాలా ఉత్సాహంగా, ఆనందంగా ఉంటుంది నాకు.

– ప్రతి రోజును ఎలా ముగిస్తారు?
ఓ గ్లాసుడు గోరు వెచ్చటి నీళ్లు తాగుతాను. రోజులో నేను చేసే చివరి పని అదే.

– వార్డ్ రోబ్ లో కచ్చితంగా ఉండే దుస్తులు?
వైట్ షర్ట్, డెనిమ్ ప్యాంట్, కాటన్ చీర, లెదర్ జాకెట్, ష్రగ్

– బ్యాగ్ లో నిత్యం ఉండే మేకప్ సామగ్రి?
బ్లష్, మస్కారా, ఐబ్రో కాంబినేషన్, లిప్ బామ్, మాయిశ్చరైజర్

taapsee

హీరోయిన్ తాప్సి

– ఫేవరెట్ హాలిడే స్పాట్
మాల్దీవులు.. ఈమధ్య వెళ్లి వచ్చాను.. టైమ్ దొరికితే మరోసారి వెళ్లాలని ఉంది.

– ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా
ఛక్ దే ఇండియా. షారూక్ నటించిన ఈ సినిమాను ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు. ఇప్పటికీ ఫ్రీ టైమ్ దొరికితే ఆ సినిమానే పెడుతుంటాను. అంతిష్టం.

– మీ జీవన సూత్రం
జీవితంలో దేనికీ ‘కుదరదు’ అనే సమాధానం చెప్పకూడదు. బతకడం కోసం కాదు, జీవితంలో ప్రతి రోజును ఆస్వాదించాలి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics