తాప్సీ ఇంటర్వ్యూ

Monday,June 10,2019 - 04:49 by Z_CLU

డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటూ హీరోయిన్ గా తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకున్న తాప్సీ ‘గేమ్ ఓవర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తమిళ్ , తెలుగు భాషల్లో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 14 న విడుదలవుతోంది. ఈ సందర్భంగా తాప్సీ మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు తన మాటల్లోనే…

 

చాలా గ్యాప్ తర్వాత

హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ తెలుగులో మాత్రం ఏడాదికో సినిమా చేస్తున్నాను. అయితే తమిళ్ లో చాలా గ్యాప్ వచ్చింది. కాంచన 2 తర్వాత అక్కడ మళ్ళీ సినిమా చేయలేదు. కోలీవుడ్ కి దూరమవుతున్నా అనుకుంటున్నా సమయంలో అశ్విన్ శరవణన్ ఈ కథ చెప్పాడు. కథ వినగానే ఇంప్రెస్ అయ్యాను. అతను డైరెక్ట్ చేసిన ‘మాయ’ సినిమాలో కొన్ని సీన్స్ చూసాను. స్టఫ్ ఉన్న డైరెక్టర్ అనిపించింది అందుకే వెంటనే ఒకే చెప్పేసాను. ఆ తర్వాత తమిళ్ తో పాటు తెలుగులో కూడా బైలింగ్వెల్ చేద్దామని ఫిక్స్ అయ్యాం.

ఇదే ఫస్ట్ టైం

ఇండియన్ సినిమాలో ఇదే ఫస్ట్ టైం. ఇప్పటి వరకూ నాకు తెలిసి ఇలాంటి కథ తెరకెక్కలేదు. అందుకే కథ విన్న వెంటనే ఏ భాషలో అయినా పరవాలేదు ఈ సినిమా చేయాలి అని డిసైడ్ అయ్యాను. హోం ఇన్వజన్ బ్యాక్ డ్రాప్ లో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ ఇది.

అవే హైలైట్

సినిమాలో కథ, కథనం చాలా కొత్తగా ఉంటాయి. నిజానికి సినిమాకు అవే మెయిన్ హైలైట్. నా క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. కానీ స్టోరీ , స్క్రీన్ ప్లే నా క్యారెక్టర్ ని డామినేట్ చేస్తాయి. అందుకే ఈ సినిమా కాన్సెప్ట్ పరంగా టాప్ లో ఉంటుంది.

 

హిందీలో డబ్బింగ్ సినిమాగా

ఈ సినిమాను కేవలం తమిళ్, తెలుగులో మాత్రమే తెరకెక్కించాం. హిందీలో డబ్బింగ్ సినిమాగా విడుదలవుతోంది. అనురాగ్ కశ్యప్ ఈ సినిమా చూసి హిందీలో డబ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇది భాషతో సంబంధం లేకుండా అందరికీ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్. అందుకే ఈ సినిమాను ప్యాన్ ఇండియా అంతటా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాం.

సినిమా కోసం తప్పలేదు

సినిమాలో నాకు యాక్సిడెంట్ జరుగుతుంది. అది ఎలా జరిగిందనేది సినిమా చూస్తే తెలుస్తోంది. అందువల్లే దాదాపు అరవై శాతం సినిమాలో నేను వీల్ చైర్ లో కూర్చొనే ఉంటాను. నా కెరీర్ లో ఫస్ట్ టైం ఇలా వీల్ చైర్ లో కూర్చోవడం. ఇప్పటి వరకూ నాకెలాంటి ఫ్యాక్చర్ జరగలేదు. కానీ సినిమా కోసం వీల్ చైర్ తప్పలేదు. నిజానికి కాళ్ళు కదపకుండా చైర్ లో కూర్చొని నటించడం చాలా కష్టమనిపించింది.

37 రోజుల్లో….

సౌత్ లో జెనరల్ గా షూటింగ్ కి ఒక టైం ఉంటుంది. ఆ టైమింగ్ తో చూసుకుంటే ఈ సినిమా కోసం రోజుకి ఒకటిన్నర షిఫ్ట్ వర్క్ చేసాం. అంటే దాదాపు పన్నెండు గంటల నుండి పద్నాలుగు గంటలు వర్క్ చేసాం. యూనిట్ అందరూ చాలా కష్టపడ్డారు. 25 రోజుల పాటు వీల్ చైర్ లో షూట్ చేసాం. 37 రోజుల్లో టోటల్ షూట్ కంప్లీట్ చేశాం.

గేమ్ డెవలపర్ గా

90 సంవత్సరంలో గేమ్స్ ఆడేదాన్ని. మ్యారియో , కాంట్రా లాంటి గేమ్స్ స్కూల్ . కాలేజి డేస్ లో బాగా ఆడేదాన్ని. ఈ సినిమాలో గేమ్ డెవలపర్ గా నటించడం చాలా ఎగ్జైట్ మెంట్ కలిగించింది.

రెస్పాన్సిబిలిటీ పెరిగింది

ఇప్పటి వరకూ నేను నటించిన సినిమా పోస్టర్ లో నా పేరు పడలేదు. నేను పని చేసిన హిందీ సినిమాలకు కూడా పోస్టర్ లో నా పేరుండదు. కానీ ఫస్ట్ టైం గేమ్ ఓవర్ తమిళ్ పోస్టర్ పై టాప్సీ ఇన్ అండ్ అస్ అని పడింది. పోస్టర్ మీద నా పేరు చూసి నా రెస్పాన్సిబిలిటీ పెరిగిందనిపించింది.

వాళ్ళే నా బిగ్ హీరోస్

నిజానికి నాకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి నేను పనిచేసిన దర్శకులే కారణం. వాళ్ళ వల్లే నటిగా ఈ స్థాయికి చేరుకున్నాను. వాళ్ళే నా బిగ్ హీరోస్.

నేను చాలా లక్కీ

నేను చాలా లక్కీ. మూడు భాషల్లో సినిమాల్లో సినిమాలు చేస్తూ కెరీర్ ని కొనసాగిస్తున్నాను. మూడు భాషల ప్రేక్షకులు నన్ను నటిగా గుర్తుపడతారు. అందుకే ఆ విషయంలో నేను చాలా లక్కీ గా ఫీలవుతుంటాను.

మూడు.. నాలుగు సినిమాలు గ్యారెంటీ

కథల ఎంపికలో ఎలాంటి ఇబ్బంది లేదు. అదృష్టం కొద్ది అన్నీ మంచి కథలే వస్తున్నాయి. అందులో నుండి మూడు నాలుగు కథలు పిక్ చేసుకొని ఈజీగా మూడు నాలుగు సినిమాలు చేయగలను అనే నమ్మకం వచ్చింది. కాకపోతే బ్యాక్ టు బ్యాక్ కాకుండా చిన్న గ్యాప్ తో సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకోవాలనుకుంటున్నా.


రేస్ లో నేనే నంబర్ వన్

నిజానికి కమర్షియల్ సినిమాలో గ్లామర్ రోల్స్ మాత్రమే చేస్తే నేను రేస్ లో మూడో స్థానంలోనో లేదా నాలుగో స్థానంలోనో ఉండేదాన్ని. డిఫరెంట్ సినిమాలు ఎంచుకుంటున్నందుకు ఇప్పుడు నా రేస్ లో నేనే మొదటి స్థానంలో పరిగెడుతున్నాను. నేను తీసుకున్న డిసిషన్ నన్ను నటిగా మరింత స్థానంలో నిలబెట్టింది.

నా దృష్టి నటనపైనే

నిర్మాతగా మారాలనే ఆలోచన ఉంది. కాకపోతే నిర్మాణం అనేది చాలా రిక్స్ తో కూడినది. అందుకే పార్ట్నర్ షిప్ లో సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నా. ప్రస్తుతం పార్ట్నర్ కోసం చూస్తున్నాను. మంచి కథ దొరికి టీమ్ సెట్ అయితే నిర్మాతగా సినిమా చేస్తాను. ప్రస్తుతానికి నా దృష్టి నటన మీదే ఉంది.

నా నెక్స్ట్ సినిమాలు అవే

ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా సైన్ చేశాను. అలాగే తెలుగులో కూడా ఒక ఆఫర్ ఉంది. హిందీలో ప్రస్తుతం రెండు సినిమాలు జరుగుతున్నాయి.

ఆ ఆలోచనే లేదు

ఇప్పుడు పెళ్లి అనే ఆలోచనే లేదు. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. నా విషయానికొస్తే.. నాకు ఎప్పుడు పిల్లలు కావాలనిపిస్తే అప్పుడే పెళ్లి చేసుకుంటాను.