సైరా సైన్యం ఇదే

Tuesday,August 20,2019 - 12:03 by Z_CLU

‘సైరా.. నరసింహారెడ్డి….’ ఇది జస్ట్ పిలుపు కాదు… నువ్వు ఒక్కడివి కాదు.. నీ వెనకాల మేము కూడా ఈ పోరాటానికి సంసిద్దంగా ఉన్నామని దిక్కులు పెక్కటిల్లేలా ఇచ్చే సూచన… అదీ నరసింహారెడ్డి సైన్యం. ఆ సైన్యం ఈ సినిమాలో డిఫెరెంట్ యాక్టర్స్ రూపంలో మరోసారి స్క్రీన్ పై కనిపించబోతుంది. ఈ క్యారెక్టర్స్ ని ఫిల్మ్ మేకర్స్.. ఇదివరకే రివీల్ చేశారు.. కానీ రీసెంట్ గా క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయన్నది కూడా పరిచయం చేశారు.

చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి – మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు. బానిస  బ్రతుకును వీడాల్సిందేనని జాతికి సందేశం ఇచ్చిన మహా వీరుడు. నరసింహారెడ్డి తర్వాతే దేశంలో బ్రిటీష్ వారిపై తిరుగుబాటులు మొదలయ్యాయి.

అమితాబ్ బచ్చన్ గోసాయి వెంకన్న…. నరసింహారెడ్డి చేసే స్వాతంత్ర్య ఉద్యమానికి దిశా నిర్దేశకుడు. గురువు.

 

సుదీప్ – అవుకు రాజు… తెలివైన నాయకుడు. నరసింహారెడ్డి శత్రువులకు చిక్కిన సమయంలో కూడా వెన్నుదన్నుగా నిలబడతాడు.

విజయ్ సేతుపతి – రాజా పాండి… బలమైన సైనికుడు. నరసింహారెడ్డి సైన్యానికి వెన్నెముక లాంటివాడు. సైన్యం ఇతని కనుసన్నల్లోనే ఉంటుంది.

తమన్నా – లక్ష్మి… గుండెనిండా దేశభక్తి ఉన్న క్యారెక్టర్. నరసింహారెడ్డి చేసే ఉద్యమానికి ఊతమిస్తుందంటే ఎంత కష్టమైనా నిలబడుతుంది.

నయనతార : సిద్ధమ్మ… నరసింహారెడ్డి భార్య. భర్త సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూ… ప్రేమని పంచే ఇల్లాలు… అలాగే యుద్ధ సమయంలో కూడా వెన్నుచూపక నిలబడే వీరవనిత.

జగపతి బాబువీరారెడ్డి… రాయాల్టీకి ఇంకో రూపం… నరసింహా రెడ్డికి చేదోడు వాదోడుగా ఉంటాడు.

వీళ్లతో పాటు సైరా నరసింహారెడ్డి సినిమాలో మరిన్ని పాత్రలు ఉన్నాయి. వాటిని కూడా దశలవారీగా  విడుదల చేయబోతున్నారు. మరికొన్ని గంటల్లో ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ కాబోతోంది.