రేపే సైరా టీజర్

Monday,August 19,2019 - 11:26 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి హంగామా ఊపందుకుంది. ఇప్పటికే మేకింగ్ వీడియోతో హల్ చల్ చేస్తున్న ఈ సినిమా, రేపట్నుంచి నెక్ట్స్ లెవెల్ కు చేరుకోనుంది. రేపు ఈ సినిమా టీజర్ ను లాంఛ్ చేయబోతున్నారు. ఈ టీజర్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. టీజర్ కు మరింత బజ్ తీసుకొచ్చేందుకు ఇప్పుడా వాయిస్ ఓవర్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.

సైరా టీజర్ ను ఒకేసారి 5 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. సౌత్ లోని 4 భాషలతో పాటు హిందీలో ఈ సినిమా టీజర్ రేపు రిలీజ్ అవుతోంది. చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోంది సైరా. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు.

మరోవైపు ఈ సినిమలో అనుష్క పాత్రపై సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. అసలు ఈ సినిమాలో అనుష్క ఉందా లేదా అనే చర్చతో పాటు.. ఉంటే ఆమె ఎలాంటి పాత్ర పోషించిందనే ఎలిమెంట్ పై అంతా చర్చించుకుంటున్నారు. దీనిపై యూనిట్ నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ రియల్ లైఫ్ స్టోరీకి పరుచూరి బ్రదర్స్ తమదైన స్టయిల్ లో ఫిక్షన్ బేస్డ్ స్క్రీన్ ప్లే జోడించగా… సాయిమాధవ్ బుర్రా అద్భుతమైన మాటల్ని రాశాడు. అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ రాబోతోంది సైరా.