'సైరా' అప్డేట్స్ .... చరణ్ మాటల్లో

Sunday,January 06,2019 - 03:39 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘సైరా’ మూవీ షూటింగ్ అప్డేట్స్ తెలియజేసాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ‘వినయ విధేయ రామ’ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన రామ్ చరణ్ ‘సైరా’ గురించి కొన్ని విశేషాలు చెప్పుకొచ్చాడు.. ప్రస్తుతం సైరా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోందని, రెండు నెలల్లో టోటల్ షూటింగ్ పూర్తికానుందని ఆ తర్వాత ప్రమోషన్ మొదలు పెట్టనున్నామని తెలియజేసాడు. ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లోనే రిలీజ్ ఉంటుందని  చెప్పాడు.

అంతే కాదు ప్రెజెంట్ తారక్ తో కలిసి నటిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ మొదటి షెడ్యూల్ బాగా జరిగిందని, తారక్ కి తనకి మధ్య షూట్ చేసిన సీన్స్ చాలా బాగా వచ్చాయని అంతకంటే ఆ సినిమా గురించి ఇంకేం చెప్పలేనని తెలిపాడు.