గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చిన సైరా

Wednesday,October 02,2019 - 08:45 by Z_CLU

మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్
చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా
అందుకే సైరాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టే తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చింది సైరా. తెలుగు రాష్ట్రాల్లో సైరా హంగామా అర్థరాత్రి నుంచే మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాల్లో అర్థరాత్రి ఒంటి గంట నుంచే సైరా షోలు స్టార్ట్ అయ్యాయి. అక్కడి ప్రభుత్వం.. వారం రోజుల పాటు రోజుకు 6 షోలు వేసుకునేలా ప్రత్యేక అనుమతి ఇచ్చింది.

ఇటు తెలంగాణలో కూడా సైరా హంగామా పీక్స్ లో కొనసాగుతోంది. హైదరాబాద్ తో పాటు చాలా ఏరియాల్లో ఉదయం 7 గంటలకే షోలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సర్కార్ కూడా సైరాకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. ఇక మెగా ఫ్యాన్స్ ఆనందానికైతే అవధుల్లేవ్. నిన్న సాయంత్రం నుంచే కటౌట్లకు పాలాభిషేకాలు, రోడ్లపై బాణసంచా కాల్చడంతో హంగామా స్టార్ట్ చేశారు.

కంప్లీట్ పాజిటివ్ టాక్ తో స్టార్ట్ అయింది సైరా. ముంబయిలో నిన్న సాయంత్రమే మీడియా కోసం ప్రత్యేకంగా షో వేశారు. వాళ్లంతా సినిమాపై చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో అర్థరాత్రి నుంచే షోలు మొదలవడంతో అక్కడ్నుంచి కూడా సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఇలా కంప్లీట్ పాజిటివ్ టాక్ తో మొదలైంది సైరా ప్రస్థానం.