గ్రాండ్ గా సైరా ప్రమోషన్

Monday,July 29,2019 - 11:52 by Z_CLU

సైరా సినిమాకు సంబంధించి అంతా సెట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నారు. అంటే ఇంకా 2 నెలల టైమ్ ఉందన్నమాట. ఈ 2 నెలల్లో పబ్లిసిటీని గ్రాండ్ గా, ప్లాన్డ్ గా చేయాలని నిర్ణయించింది యూనిట్. ఇందులో భాగంగా ఓ మేకింగ్ వీడియో రెడీ చేసింది.

వచ్చే నెల నుంచి సైరా ప్రమోషన్ ను ఈ మేకింగ్ వీడియోతో ప్రారంభించబోతున్నారు. అటుఇటుగా 2 నిమిషాల నిడివి ఉండే ఈ మేకింగ్ వీడియోలో సినిమాను ఎంత గ్రాండియర్ గా తెరకెక్కించారు, ఎంత రిచ్ గా ఉండబోతోంది లాంటి విషయాల్ని చూపించబోతున్నారు.

ఈ మేకింగ్ వీడియోతో ప్రారంభించి దశలవారీగా టీజర్, ట్రయిలర్, లిరికల్ వీడియోస్, సాంగ్ బిట్స్.. ఇలా బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్ ఇవ్వాలని నిర్ణయించారు.

చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన సైరాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించాడు. దాదాపు రెండేళ్ల పాటు కష్టపడి తీసిన ఈ సినిమా తెలుగు సినిమా స్టాండర్డ్స్ ను నెక్ట్స్ లెవెల్లో నిలబెట్టబోతోంది.