'సైరా' నెక్స్ట్ షెడ్యూల్ డీటెయిల్స్

Sunday,December 31,2017 - 10:03 by Z_CLU

ఖైదీ నంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా నర్సింహారెడ్డి’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రెండో షెడ్యూల్ కి రెడీ అవుతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ‘సైరా’ రెండో షెడ్యూల్ ఫిబ్రవరి మొదటి వారంలో స్టార్ట్ అవుతుందని, ఈ షెడ్యూల్ చిరు తో నయనతార కూడా పాల్గొంటుందని తెలుస్తుంది.

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఉయ్యాల వాడ నర్సింహా రెడ్డి కథతో హిస్టారికల్ బయో పిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బిగ్ ని అమితాబ్ తో పాటు జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి కీ రోల్స్ నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.