సైరా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,October 07,2019 - 02:03 by Z_CLU

చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరా ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకుంది. ఇక్కడ ఫస్ట్ వీకెండ్ అంటే శుక్ర, శని, ఆది వారాలు కాదు. ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా 2వ తేదీ బుధవారం విడుదలైంది. సో.. ఈ సినిమాది ఎక్స్ టెండెడ్ వీకెండ్ అన్నమాట. అలా 5 రోజులు పూర్తిచేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 69 కోట్ల 70 లక్షల రూపాయలు కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ చూసుకుంటే ఈ సినిమా ఇప్పటికే 150 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 110 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ చూస్తుంటే.. మరో వచ్చే వారాంతం నాటికి ఇది బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఫస్ట్ వీకెండ్ నాటికే ఈ సినిమా అన్ని ఏరియాస్ లో దాదాపు బ్రేక్-ఈవెన్ కు దగ్గరైంది. పెద్ద సినిమాలేవీ మార్కెట్లో లేకపోవడం, దసరా సీజన్ కారణంగా సైరాకు మరో వారం రోజుల పాటు భారీ వసూళ్లు అంచనా వేస్తున్నారు.

ఏపీ, నైజాం 5 రోజుల షేర్
నైజాం – రూ. 19.72 కోట్లు
సీడెడ్ – రూ. 12.10 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 10 కోట్లు
ఈస్ట్ – రూ. 6.65 కోట్లు
వెస్ట్ – రూ. 5.25 కోట్లు
గుంటూరు – రూ. 7.39 కోట్లు
నెల్లూరు – రూ. 3.19 కోట్లు
కృష్ణా – రూ. 5.40 కోట్లు