సైరా ఫస్ట్ లుక్.. మోస్ట్ ఎనర్జిటిక్

Wednesday,August 22,2018 - 11:02 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఒక రోజు ముందే సైరా టీజర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు పుట్టినరోజు నాడు సైరా ఫస్ట్ లుక్ ను లాంఛ్ చేశారు. టీజర్ లో ఇప్పటికే చిరు గెటప్, యాక్షన్ చూసేసిన ఆనందంలో ఉన్న ఫ్యాన్స్ కు ఫస్ట్ లుక్ పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. కానీ ఈ లుక్ గురించి కూడా చెప్పుకోవాలి.

63 ఏళ్ల వయసులో ఇలాంటి యాక్షన్ సబ్జెక్ట్ ఎంచుకోవడమే పెద్ద రిస్క్ అనుకుంటే.. ఆ పాత్ర కోసం బరువు తగ్గి, ఫైట్స్ చేయడం అంతకంటే పెద్ద రిస్క్. అభిమానుల కోసం ఇంత కష్టాన్ని పడుతున్నారు చిరంజీవి. ఆ కష్టం, కృషి ఫస్ట్ లుక్ లో కనిపిస్తోంది.

హెయిర్ స్టయిల్, మేకప్, కాస్ట్యూమ్స్, మేకోవర్.. ఇలా ప్రతి ఎలిమెంట్ లో సైరా సినిమా టాప్-క్లాస్ లో ఉండబోతోందనే విషయం ఫస్ట్ లుక్ చూస్తే తెలుస్తోంది. యుద్ధరంగంలో కదంతొక్కుతున్నట్టున్న ఈ ఒక్క స్టిల్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

రామ్ చరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.