మొదటి రోజే మిలియన్ డాలర్ క్లబ్ లోకి..!

Thursday,October 03,2019 - 02:42 by Z_CLU

వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజైన సైరా సినిమాకు అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుందని అంతా అంచనా వేస్తున్నారు. అయితే అంతకంటే ముందే ఓవర్సీస్ లో రికార్డు నమోదైంది. విడుదలైన మొదటి రోజే మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది సైరా.

అవును.. ప్రీమియర్స్ తో కలుపుకొని మొదటి రోజే 10 లక్షల డాలర్లు కొల్లగొట్టింది సైరా సినిమా. ప్రీమియర్స్ తో ఈ సినిమాకు 8 లక్షల 17వేల డాలర్లు రాగా, మిగిలిన మొత్తాన్ని మొదటి రోజు కలెక్ట్ చేసింది. అయితే ఇది కేవలం కొన్ని ప్రాంతాలకు సంబంధించిన లెక్క మాత్రమే. మరో 54 సెంటర్ల నుంచి వివరాలు అందాల్సి ఉంది. అవి కూడా జోడిస్తే వసూళ్లు మరింత పెరుగుతాయి.

రెండో రోజు కూడా ఓవర్సీస్ లో సైరా సినిమా గ్రాండ్ గా ఓపెన్ అయింది. ఇదే ఊపు కొనసాగితే.. మరో 3 రోజుల్లో ఈ సినిమా 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి కూడా ఎంటర్ అవుతుంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా రెండో రోజు గ్రాండ్ గా ఓపెన్ అయింది. నార్త్ లో మాత్రం సైరా సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు.