2 మిలియన్ క్లబ్ లో చేరిన సైరా

Monday,October 07,2019 - 05:02 by Z_CLU

ఓవర్సీస్ లో 2 మిలియన్ క్లబ్ లో చేరింది సైరా సినిమా. చిరంజీవి నటించిన ఈ భారీ బడ్జెట్ సినిమా ఓవర్సీస్ లో మంచి రెస్పాన్స్ తో నడుస్తోంది. నిన్నటి వసూళ్లతో కలుపుకొని ఈ సినిమా 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది. కాకపోతే ఇది హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన తెలుగు సినిమాల లిస్ట్ లోకి మాత్రం ఇంకా చేరలేదు.

విడుదలైన 5 రోజులకు 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది సైరా సినిమా. ఇది 3 మిలియన్ డాలర్ క్లబ్ లోకి వెళ్లాలంటే కనీసం మరో 10 రోజులు ఆడాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఇది ఓవర్సీస్ లో టాప్-5 సినిమాల లిస్ట్ లోకి చేరుతుంది.

ఓవర్సీస్ లో టాప్-10 సినిమాల లిస్ట్
1. బాహుబలి -2 – $ 20,571,695
2. బాహుబలి – $ 6,861,819
3. రంగస్థలం – $ 3,513,450
4. భరత్ అనే నేను – $ 3,416,451
5. సాహో – $ 3,233,611
6. శ్రీమంతుడు – $ 2,883,437
7. మహర్షి – $ 2,543,515
8. గీత గోవిందం – $ 2,465,367
9. అ..ఆ – $ 2,449,174
10. ఖైదీ నంబర్ 150 – $ 2,447,043