సైరా మెగాస్టార్.. తెలుగు రాష్ట్రాల్లో వంద కోట్ల షేర్

Tuesday,October 15,2019 - 01:00 by Z_CLU

మెగాస్టార్ స్టామినా మరోసారి ఎలివేట్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో సైరా సినిమా ఏకంగా వంద కోట్ల రూపాయల షేర్ సాధించింది. తన 13 రోజుల రన్ తో ఆ ఘనత సాధించింది సైరా. తన 150వ సినిమాతో వంద కోట్ల షేర్ సాధించిన చిరంజీవి, ఇప్పుడు 151వ చిత్రంతో కూడా ఆ ఘనత సాధించారు.

తాజా రన్ తో ఈ సినిమా కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయింది. మరీ ముఖ్యంగా కీలకమైన నైజాం, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఈ సినిమా లాభాల్లోకి ఎంటరైంది. ఇక మిగతా అన్ని చోట్ల దాదాపు 90శాతం రికవరీతో బ్రేక్ ఈవెన్ కు దగ్గరైంది. ఈ వీకెండ్ కు ఏపీ, తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో లాభాల్లోకి ఎంటర్ అవుతుంది సైరా.

అటు ఓవర్సీస్ లో కూడా టాప్-10 లిస్ట్ లోకి చేరింది సైరా. ఖైదీ నంబర్ 150తో తను క్రియేట్ చేసిన రికార్డును తిరగరాయడంతో పాటు.. సైరాతో మరిన్ని సినిమాల్ని అధిగమించి, హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన టాప్-10 టాలీవుడ్ మూవీస్ లిస్ట్ లోకి ఎంటరయ్యారు చిరు.

ఏపీ, నైజాం 13 రోజుల షేర్
నైజాం – రూ. 31.30 కోట్లు
సీడెడ్ – రూ. 18.10 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 15.60 కోట్లు
ఈస్ట్ – రూ. 8.19 కోట్లు
వెస్ట్ – రూ. 6.38 కోట్లు
గుంటూరు – రూ. 9.39 కోట్లు
నెల్లూరు – రూ. 4.38 కోట్లు
కృష్ణా – రూ. 7.26 కోట్లు