సైరా సెన్సార్ టాక్

Monday,September 23,2019 - 05:29 by Z_CLU

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ సైరా సెన్సార్ పూర్తిచేసుకుంది. సెన్సార్ అఫీషియల్స్ ఈ సినిమాకు U/A సర్టిఫికేట్స్ ఇచ్చారు. ఎలాంటి కట్స్ సూచించలేదు. మూవీ రన్ టైమ్ 164 నిమిషాలుంది.

సినిమా చూసిన సెన్సార్ అధికారులు యూనిట్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. సినిమా చాలా బాగుందని, మరీ ముఖ్యంగా సెకండాఫ్ ఎక్సటార్డనరీగా ఉందని చెప్పుకొచ్చారు. గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయంటున్నారు. సెన్సార్ టాక్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

తెలుగుతో పాటు ఒకేసారి తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైరాను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. ఎలాంటి టెక్నికల్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఇలా 8 రోజుల ముందే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేశారు. రిలీజ్ కు ఒక రోజు ముందే ఇండియాతో పాటు ఓవర్సీస్ లోని అన్ని లొకేషన్స్ కు కంటెంట్ ను పంపించబోతున్నారు.

రీసెంట్ గా వచ్చిన సాహో విషయంలో ఇలా కంటెంట్ లో జాప్యం తలెత్తింది. మొదటిరోజు నార్త్ లోని కొన్ని ప్రాంతాలకు కంటెంట్ సకాలంలో చేరలేదు. ఫస్ట్ డే వసూళ్లపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సైరా రిలీజ్ కు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు.