సైరా: సింగిల్ షెడ్యూల్ కు రూ.40 కోట్లు

Thursday,June 28,2018 - 01:57 by Z_CLU

చిరంజీవి 151వ సినిమా, మెగాస్టార్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా వస్తోంది సైరా నరసింహారెడ్డి. దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా మరోసారి వార్తల్లోకెక్కింది. దీనికి కారణం ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్. అవును.. ఈ ఒక్క షెడ్యూల్ కోసమే 40 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తోంది యూనిట్.

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి యాక్షన్ పార్ట్ షూట్ చేస్తున్నారు. అది కూడా నైట్ ఎఫెక్ట్ లో చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ పర్యవేక్షణలో షూట్ చేస్తున్న ఈ షెడ్యూల్ కోసం 40 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు నిర్మాత రామ్ చరణ్. సినిమాకు సంబంధించిన కీలకమైన షెడ్యూల్ ఇది. తన సైన్యంతో కలిసి నరసింహారెడ్డి, బ్రిటిష్ వాళ్లపై దండెత్తే ఎపిసోడ్ ఇది.

కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సైరా సినిమా తెరకెక్కుతోంది. సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలనుకుంటున్నారు.