యుద్ధ భూమి: సైరా సెకెండ్ ట్రయిలర్

Thursday,September 26,2019 - 11:58 by Z_CLU

సైరా సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రయిలర్, సోషల్ మీడియా దుమ్ముదులుపుతోంది. రికార్డు వ్యూస్ వస్తున్నాయి. ప్రతి రోజూ ఈ సినిమా ట్రయిలర్ వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయి. కానీ అంతలోనే మరో ట్రయిలర్ రిలీజ్ చేసింది యూనిట్. కొద్దిసేపటి కిందట సైరా సెకెండ్ ట్రయిలర్ రిలీజ్ అయింది.

ఫస్ట్ ట్రయిలర్ లో నటీనటుల పరిచయం, వాళ్ల డైలాగ్స్ ఉంచారు. సెకెండ్ ట్రయిలర్ ను మాత్రం పూర్తిగా యుద్ధ సన్నివేశాలే చూపించారు. కేవలం చిరు, బిగ్ బి డైలాగ్స్ మాత్రమే ఉన్నాయి. సినిమా ఎంత గ్రాండియర్ గా ఉండబోతోందనే విషయం రెండో ట్రయిలర్ తో మరోసారి ప్రూవ్ అయింది.

నిజం చెప్పాలంటే ఫస్ట్ ట్రయిలర్ కంటే రెండో ట్రయిలర్ తోనే సైరా కు పాన్-ఇండియా అప్పీల్ వచ్చింది. తెలుగులో తాజా ట్రయిలర్ తో మరింత బజ్ రాగా.. నార్త్ లో ఈ రెండో ట్రయిలర్ వల్ల సినిమాకు మంచి ప్రచారం వచ్చింది. అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి వస్తోంది సైరా.