సైరా రెగ్యులర్ షూట్ డేట్ ఫిక్స్

Tuesday,November 14,2017 - 11:28 by Z_CLU

చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహారెడ్డి. చాన్నాళ్లుగా ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూట్ మోడ్ లోకి రానుంది. వచ్చేనెల 6 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభంకానుంది. యాక్షన్ ఎపిసోడ్స్ తో సైరా షూట్ స్టార్ట్ చేయాలని నిర్ణయించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సెట్స్ పైకి రానున్న ఈ సినిమాను కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.

సైరా సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించబోతున్నాడు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ తో పాటు కన్నడ స్టార్ సుదీప్, తమిళ హీరో విజయ్ సేతుపతి లాంటి నటులు ఇందులో కనిపించబోతున్నారు. ఒక హీరోయిన్ గా నయనతారను ఇప్పటికే ఎంపిక చేశారు. సెకెండ్ హీరోయిన్ గా ప్రగ్యా జైశ్వాల్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఆగస్ట్ 22న సినిమా ప్రారంభమైన రోజునే నటీనటులతో పాటు టెక్నీషియన్ల వివరాల్ని వెల్లడించారు.

తెలుగులో బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ చిత్రంగా రాబోతోంది సైరా నరసింహారెడ్డి. ఈ సినిమా కోసం అటుఇటుగా 200 కోట్ల రూపాయలు పెట్టాలని నిర్ణయించారు. మూవీకి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ తో పాటు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో భారీ సెట్స్ నిర్మించారు.