సెగలు పుట్టిస్తున్న స్వీట్ వార్నింగ్

Friday,December 09,2016 - 10:50 by Z_CLU

ఒకటా రెండా తొమ్మిదేళ్ళ గ్యాప్… సినిమా చేద్దామని డిసైడయ్యాక కూడా అంత ఈజీగా సెట్స్ పైకి రాలేదు మెగాస్టార్. స్టోరీ దగ్గరి నుండి డైరెక్టర్ ల వరకు, ఆచితూచి డెసిషన్స్ తీసుకున్న చిరు, అటు తన ఇమేజ్ ని, ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న ట్రెండ్ ని బ్యాలన్స్ చేస్తూ మరీ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేసుకున్నాడు.

khaidi-no-150-teaser

మెగాస్టార్ నుండి మ్యాగ్జిమం మాస్ కంటెంట్ ని ఎక్స్ పెక్ట్ చేసే ఫ్యాన్స్, కాస్తంత కామెడీ ఫ్లేవర్ తగ్గిందనిపించినా అంత ఈజీగా కాంప్రమైజ్ అవ్వరు. తన ఫ్యాన్స్ పల్స్ తెలుసు కాబట్టే, చిరు స్టోరీ సెలెక్షన్ బాక్సాఫీస్ ని ప్రతిసారి బద్దలు చేస్తూనే ఉంటుంది.

నిన్న రిలీజ్ అయిన టీజర్ లో ‘నచ్చితే కానీ చేయను’ అంటూ స్టైలిష్ లుక్ తో ఎంట్రీ ఇచ్చిన చిరు, తన ఫ్యాన్స్ కి నచ్చే సినిమానే చేశాడు అన్న క్లారిటీ అయితే ఇచ్చేశాడు. చివరన ఇచ్చిన స్వీట్ వార్నింగ్… టీజర్ రిలీజయిన కాసేపట్లోనే చిరు ఫ్యాన్స్ కి ఊతపదమయిపోయింది.