మరో హీరోయిన్ షాకిచ్చింది

Sunday,November 20,2016 - 10:30 by Z_CLU

ఈమధ్య కొందరు హీరోలు సడెన్ గా మరో హీరో సినిమాలో కనిపించి షాక్ ఇస్తున్నారు. ఆడియన్స్ కు ఇది కాస్త థ్రిల్ కలిగించడంతో ఈ ఫార్ములా బాగానే వర్కవుట్ అవుతోంది. అందుకే కావాలని ఆ స్పెషల్ ఎప్పీయరెన్స్ ను ఎక్కడా బయటపెట్టడం లేదు. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు అది చూసి థ్రిల్ ఫీలవ్వడం సినిమాకు ప్లస్ అవుతోంది. తాజాగా ఓ హీరోయిన్ కూడా ఇలాంటి థ్రిల్లింగ్ నే అందించింది.

avika-gor-latest-stills-in-traditional-out-fits-1
నిఖిల్ హీరో గా తెరకెక్కిన లేటెస్ట్  సినిమా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఈ శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రం లో హెబ్బా పటేల్, నందిత శ్వేతా హీరోయిన్ లు గా నటించారు.  ఈ సినిమాలో వీరిద్దరే హీరోయిన్లుగా నటించారనుకొని థియేటర్స్ కు వెళ్లిన ప్రేక్షకులను సర్ ప్రయిజ్ చేసింది చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్. ఈ సినిమాలో హెబ్బా పటేల్, నందిత శ్వేతా కథానాయికలు అయినప్పటికీ కథ అంతా అవికా పాత్రతోనే అల్లుకుంటుంది. అంతేకాదు అవికా నటించిన సన్నివేశాలు ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. ఇక ఈ విషయాన్నీ రిలీజ్ వరకూ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు వి.ఐ.ఆనంద్.