సువర్ణ సుందరి రిలీజ్ డేట్ ఫిక్స్

Thursday,May 02,2019 - 10:30 by Z_CLU

పూర్ణ, సాక్షి చౌదరి, జయప్రద ప్రధాన పాత్రల్లో నిర్మించిన సినిమా “సువర్ణసుందరి”. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఈ సినిమాను తెరకెక్కించాడు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోందన్న క్యాప్షన్ తో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తీశారు. ఓ సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్బంగా డైరెక్ట‌ర్ సూర్య మాట్లాడుతూ… “సువర్ణ సుందరి చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఏడాది పాటు వ‌ర్క్ జ‌రిగింది. టైమ్ తీసుకున్నా అవుట్ పుట్ మాత్రం అద్భుతంగా వ‌చ్చింది. గత కొంతకాలంగా తెలుగులో స్క్రీన్ ప్లే బెస్డ్ సినిమాలకు ఆదరణ లభిస్తోంది. సువర్ణ సుందరి కూడా మూడు జన్మల కాన్సెప్ట్ తో ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లే తో తెరకెక్కింది.” అన్నారు.

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తిచేసుకున్న ఈ సినిమా సెన్సార్ కు రెడీ అయింది. తెలుగు, కన్నడ, తమిళ్ భాషల్లో మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు
జ‌య‌ప్ర‌ద‌, పూర్ణ‌, సాక్షి చౌదరి, ఇంద్ర‌, రామ్ మద్దుకూరి, సాయికుమార్‌, కోటాశ్రీ‌నివాస‌రావు, ముక్త‌ర్‌ఖాన్‌, నాగినీడు, స‌త్య‌ప్ర‌కాష్‌, అవినాష్
టెక్నీషియన్స్
మ్యూజిక్‌ డైరెక్ట‌ర్: సాయికార్తిక్‌
స్టంట్స్: రామ్‌ సుంక‌ర‌
ఆర్ట్ డైరెక్ట‌ర్: నాగు
సినిమాటోగ్రఫీ: ఎల్లుమహంతి
ఎడిట‌ర్: ప్ర‌వీణ్‌పూడి
ప్రొడ్యూస‌ర్: ఎం.ఎల్‌.ల‌క్ష్మి
స్టోరీ, డైరెక్షన్: ఎం.ఎస్‌.ఎన్‌.సూర్య‌