విడుదలకు సిద్ధమైన మరో విజువల్ వండర్

Wednesday,August 08,2018 - 11:34 by Z_CLU

ప్రస్తుతం కంటెంట్ బేస్డ్ సినిమాలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపధ్యంలో మరో డిఫరెంట్  కంటెంట్, అమేజింగ్ గ్రాఫిక్స్ తో వస్తోంది “సువర్ణసుందరి”. పునర్జన్మల నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రంలో సీనియర్ నటి జయప్రద కీలకపాత్ర పోషిస్తుండగా.. ఆమెకు తల్లిగా పూర్ణ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ కి విశేషమైన స్పందన లభించగా.. ఆగస్ట్ లో ఆడియోను విడుదల చేసి సెప్టెంబర్ లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

“బాహుబలి, భజరంగీ భాయిజాన్” చిత్రాలకి వర్క్ చేసిన వి.ఎఫ్.ఎక్స్ టీం “సువర్ణసుందరి” చిత్రానికి కూడా వర్క్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకొంది. ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది సువర్ణ సుందరి.

సూర్య ఎంఎస్ఎన్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శ్రీ కృష్ణ దేవ‌రాయ‌ల స్టోరీ ఆధారంగా తెర‌కెక్క‌ుతున్న‌ట్టు స‌మాచారం. చ‌రిత్ర భ‌విష్య‌త్‌ని వెంటాడుతోంది అనే ట్యాగ్ లైన్‌తో విజువ‌ల్ ఫీస్ట్‌గా రాబోతున్న ఈ మూవీకి సాయి కార్తీక్ సంగీత దర్శకుడు.

నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్‌ ఖాన్, అవినాష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎల్లు మహంతి, సంగీతం: సాయి కార్తీక్‌, దర్శకత్వం: ఎం.ఎస్.ఎన్. సూర్య