వెంకీ అనౌన్స్ చేసేదెప్పుడో ?

Sunday,May 14,2017 - 11:50 by Z_CLU

లేటెస్ట్ గా హిందీ మూవీ రీమేక్ గా తెరకెక్కిన ‘గురు’ తో థియేటర్స్ లో హంగామా చేసిన విక్టరీ వెంకటేష్ ఈ సినిమా రిలీజ్ అయి చాలా రోజులవుతున్నా నెక్స్ట్ ప్రాజెక్ట్ పై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ మైంటైన్ చేస్తూ ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు.

లేటెస్ట్ గా వెంకీ లిస్ట్ లో క్రిష్, పూరి వంటి స్టార్ డైరెక్టర్స్ పేర్లు వినిపించినా వీరిద్దరూ చెరో సినిమాతో ప్రెజెంట్ గా ఫుల్ బిజీ అయిపోయారు. ఇక వెంకీ తో ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ అనే టైటిల్ ను కూడా అనౌన్స్ చేసిన కిశోర్ తిరుమల ప్రెజెంట్ రామ్ తో మరో సినిమాను స్టార్ట్ చేసి ఆ సినిమాతో సెట్స్ పై ఉన్నాడు. లేటెస్ట్ గా బాలీవుడ్ లో మంచి కలెక్షన్స్ సాధించిన జాలీ ఎల్.ఎల్.బి అనే సినిమాను వెంకీ తెలుగులో రీమేక్ చేస్తున్నాడంటూ వార్తలొచ్చిన దాని పై ఎలాంటి క్లారిటీ లేదు. సో ఇలా నెలకో డైరెక్టర్ తో వెంకీ సినిమా చేస్తున్నాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నా వెంకీ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. మరి ఈ సీనియర్ హీరో నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేదెప్పుడో..?