బన్నీ నెక్స్ట్ సినిమాపై సస్పెన్స్

Sunday,January 28,2018 - 04:30 by Z_CLU

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా’  సినిమాతో సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. వక్కంతం వంశీ డైరెక్షన్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఏప్రిల్ 27 న థియేటర్స్ లోకి రానున్న బన్నీ ఈ సినిమా తర్వాత చేయబోయే నెక్స్ట్ సినిమాపై మాత్రం ఇంకా సస్పెన్స్ మెంటైన్ చేస్తున్నాడు. లేటెస్ట్ గా లింగుస్వామి తో బన్నీ తమిళ్, తెలుగులో  బైలింగ్వెల్ సినిమాను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.. అయితే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి అల్లు అర్జున్ ఎక్కడ ఈ సినిమా గురించి ప్రస్తావించకపోవడంతో ఈ సినిమా ఉండకపోవచ్చనే వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. అంతే కాదు బన్నీ ఓ యంగ్ డైరెక్టర్ తో  సినిమా చేయడానికి రెడి అవ్తున్నాడని, అతనికిదే మొదటి సినిమా అనే టాక్ కూడా వినిపిస్తుంది.

ఇక లేటెస్ట్ గా అల్లు శిరీష్ తో ‘ఒక్క క్షణం’ సినిమా చేసిన విఐ ఆనంద్ తో బన్నీ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడని, బన్నీ చేసే నెక్స్ట్ సినిమా ఇదే అనే వార్త కూడా చక్కర్లు కొడుతుంది. అయితే  నెక్స్ట్ సినిమాపై ఇలా ఎన్ని వార్తలు వినిపిస్తున్నా ఇంత వరకూ నెక్స్ట్ సినిమాపై అల్లు అర్జున్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో స్టైలిష్ స్టార్ నెక్స్ట్ సినిమా ఏ డైరెక్టర్ తో ఉంటుందా..అనే క్యూరియాసిటీ వెయిట్ చేస్తున్నారు ఫాన్స్ . మరి బన్నీ నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇచ్చేదెప్పుడో..