F3 మరో హీరో ఎవరు ?

Monday,December 14,2020 - 06:49 by Z_CLU

 వెంకటేష్ , వరుణ్ తేజ్ లతో అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న  ‘F3’ సినిమాపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. తాజాగా వెంకటేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని మేకర్స్ ఓ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేసి త్వరలోనే సినిమా పట్టాలెక్కనుందని హింట్ ఇచ్చేశారు.  అయితే ఈ సినిమాలో నటించబోయే మూడో హీరోపై మాత్రం ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. F2 ప్రమోషన్స్ లో సీక్వెల్ చేస్తే అందులో ముగ్గురు హీరోలుంటారు అని అనిల్ రావిపూడి చెప్పుకున్నాడు.

ఆ వెంటనే రవితేజ పేరు కూడా న్యూస్ లోకి వచ్చింది. కానీ ఇంత వరకూ ఆ విషయంపై క్లారిటీ లేదు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా చేస్తున్నాడు రవితేజ. నెక్స్ట్ మారుతి , త్రినాద్ రావు నక్కిన లతో సినిమాలు లైన్లో ఉన్నాయి. మరి వాటి మధ్యలో మాస్ మహారాజా F3 కోసం డేట్స్ అడ్జెస్ట్ చేస్తాడా చూడాలి. ఏదేమైనా వెంకీ , రవి తేజ , వరుణ్ ఈ కాంబోలో సినిమా అంటే ఆడియన్స్ లో మరిన్ని అంచనాలు నెలకొనడం ఖాయం.

Also Check F3 స్క్రిప్ట్ వర్క్ లో అనిల్ రావిపూడి బిజీ !