‘ఇస్మార్ట్ శంకర్’ లో సస్పెన్స్ ఎలిమెంట్స్

Thursday,May 16,2019 - 12:00 by Z_CLU

‘ఇస్మార్ట్ శంకర్’ టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయినా ఈ టీజర్ పరిచయం చేసింది జస్ట్ హీరో క్యారెక్టర్ లోని అగ్రెసివ్ యాంగిల్ మాత్రమే. పూరి మార్క్ రామ్ ని చూడాలనుకున్న ఫ్యాన్స్ కి కొంచెం ఊరటనిచ్చిందంతే. ఈ సినిమా చుట్టూ క్యూరియాసిటీ రేజ్ చేస్తున్న సస్పెన్స్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి.

అలాంటి కథేనా..? : ఈ సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుండి ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందనే టాక్ నడుస్తుంది. నిజానికి ఈ టీజర్ లో కొద్దో గొప్పో స్టోరీలైన్ రివీల్ అవుతుందనుకున్నారు ఫ్యాన్స్. కానీ ఇప్పటికీ ఈ విషయంలో కన్ఫర్మేషన్ రాలేదు.

హైదరాబాద్ బ్యాక్ డ్రాప్..?: టైటిల్ దగ్గరి నుండి రీసెంట్ గా రివీల్ అయిన హీరో క్యారెక్టరైజేషన్ వరకు పక్కా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ అని తెలుస్తుంది. పూరి పర్టికులర్ గా ఇలాంటి బ్యాక్ డ్రాప్ నే ఎంచుకోవడానికి రీజన్ ఏమై ఉంటుంది..? అసలు ఈ సినిమా కథ ఎలా ఉండబోతుంది..?

విలన్ ఎవరు..?: సినిమాని ఫాస్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయడం వల్ల పెద్దగా ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదా..? లేకపోతే పూరి ఈసారి కావాలని ఈ స్థాయిలో సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తున్నాడా..? పక్కాగా తెలీదు కానీ ఈ సినిమాలో విలన్ ఎవరు..? ఎలా ఉండబోతున్నాడు అనే డీటేల్స్ కూడా ఇప్పటి వరకు ఎక్కడా బయటికి రాలేదు.

నిధి అగర్వాల్ సైంటిస్టా..? : సినిమాలో ఇద్దరు హీరోయిన్స్… అందులో నిధి అగర్వాల్ సైంటిస్ట్ అనే టాక్ కూడా ఉంది. అలాగని కన్ఫమ్ గా చెప్పడానికి ఓ వర్కింగ్ స్టిల్ కానీ, మేకర్స్ నుండి అప్డేట్ కానీ ఏమీ లేదు. ఇప్పటికీ ఇది పెద్ద సస్పెన్సే.

ఇలా ‘ఇస్మార్ట్ శంకర్’ లో సస్పెన్స్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి.