టైం తీసుకుంటున్న మెగా హీరో

Sunday,August 26,2018 - 12:20 by Z_CLU

మెగా హీరో సాయి ధరం తేజ్ నెక్స్ట్ సినిమాపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తేజ్ ‘చిత్రలహరి’ అనే సినిమా చేయబోతున్నాడని తెల్సిందే.. కానీ ఆ సినిమా గురించి ఇంతవరకూ ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా తేజ్ నెక్స్ట్ సినిమాపై మరో వార్త చక్కర్లు కొడుతుంది. ఇటివలే ‘గీత గోవిందం’తో బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురాంతో తేజ్ ఓ సినిమా చేయబోతున్నాడని..ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మించనున్నారనే వార్త వినిపిస్తుంది.

కెరీర్ ఆరంభంలో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ తో దూసుకెళ్ళిన తేజ్ ప్రస్తుతం వరుస అపజయాలతో ట్రాక్ తప్పిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం హీరోగా మళ్ళీ హిట్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్న తేజ్ నెక్స్ట్ ఎవరి డైరెక్షన్ లో సినిమా చేస్తాడో తెలియాలంటే ఇంకాస్త టీం పట్టేలా ఉంది.