బన్నీ అనౌన్స్ మెంట్...ఇంకా టైం ఉంది.

Sunday,April 29,2018 - 04:02 by Z_CLU

ప్రస్తుతం నా పేరు సూర్య ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.అయితే ఈ సినిమా తర్వాత బన్నీ చేయబోయే సినిమాపై ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికే లింగుస్వామి తో సినిమా లాంచ్ చేసిన బన్నీ ఆ సినిమా గురించి మళ్లీ ఎలాంటి అనౌన్స్ మెంట్ చేయలేదు. మరో వైపు బన్నీ నెక్స్ట్ సినిమా లిస్టు లో  కొరటాల శివతో పాటు క్రిష్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

ఇక గీత ఆర్ట్స్ లో బన్నీ కోసం కొన్ని కథలు కూడా రెడి అవుతున్నాయట. ఇక ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా కోసం భారీగా వర్కౌట్స్ చేసిన బన్నీ రిలీజ్ తర్వాత ఫ్యామిలీ తో ఓ వెకేషన్ ప్లాన్ చేస్తున్నాడు. వెకేషన్ నుండి రాగానే నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేస్తాడని సమాచారం