ఎన్టీఆర్ హీరోయిన్ పై ఇంకా సస్పెన్స్

Friday,April 07,2017 - 10:00 by Z_CLU

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబీ డైరెక్షన్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.. తారక్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్న ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది..

ఇప్పటికే ఈ సినిమా కోసం రాశి ఖన్నాని ఒక హీరోయిన్ గా సెలెక్ట్ చేసిన మేకర్స్ మరో హీరోయిన్ కూడా త్వరలోనే ఫిక్స్ చేసుకొనే ప్రాసెస్ లో ఉన్నారు. అయితే ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి మరో హీరోయిన్ పేరు అనౌన్స్ చేయకపోవడంతో తారక్ సరసన నటించే మరో హీరోయిన్ ఎవారా? అనే క్యూరియాసిటీ తో వెయిట్ చేస్తున్నారు ఫాన్స్. ఇప్పటికే మెయిన్ హీరోయిన్ గా కీర్తి సురేష్ తో పాటు పలు హీరోయిన్స్ పేర్లు వినిపించినప్పటికీ ఆ విషయం పై ఇంకా ఎలాంటి అనౌన్స్ మెంట్ ఇవ్వకుండా సస్పెన్స్ మైంటైన్ చేస్తున్నారు మేకర్స్. మరి తారక్ సరసన ఈ సినిమాలో నటించే ఆ హీరోయిన్ ఎవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సిందే…