పర్ఫెక్ట్ సినిమా అంటున్నారు - సుశాంత్

Saturday,August 11,2018 - 03:57 by Z_CLU

సుశాంత్ -రుహాని శర్మ జంటగా తెరకెక్కిన ‘చిలసౌ’ ఇటివలే విడుదలై పాజిటీవ్ ఫీడ్ బ్యాక్ అందుకుంది. హీరో రాహుల్ దర్శకుడిగా మారి రూపొందించిన ఈ లవ్ ఎంటర్ టైనర్ ప్రేక్షకులను అలరిస్తూ రెండో వారంలోకి ఎంటర్ అయ్యింది. ఈ సందర్భంగా  టీం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు యూనిట్.

ఈ ఈవెంట్ లో హీరో సుశాంత్ మాట్లాడుతూ ” ఎప్పుడు చేయని వారందరూ  ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పి సినిమా గురించి మాట్లాడుతున్నారు. హీరోగా నీకు పర్ఫెక్ట్ అనిపించే కరెక్ట్ సినిమా చేసావ్ అంటూ  చెప్తున్నారు. నిజానికి సినిమా చేసే ముందు ప్రేక్షకులు ఆదరిస్తారా.. అనే డౌట్ నాలో ఉంది. కాని చిన్న మావయ్య పేరు పోస్టర్ మీద పడగానే నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది.  రిలీజ్ రోజు మార్నింగ్ షో కే పాజిటీవ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. నాతో ఈ సినిమా చేసిన రాహుల్ కి స్పెషల్ థాంక్స్. నన్ను రాహుల్ ని నమ్మి మాకు సపోర్ట్ చేసి సినిమా ఇంత బాగా రావడానికి సహకరించిన మా నిర్మాతలు జశ్వంత్, భరత్ అలాగే మేము చేసిన ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించి మాకు అండగా నిలిచిన మావయ్యకి స్పెషల్ థాంక్స్  ” అన్నారు.