సుశాంత్ ఇంటర్వ్యూ

Monday,July 30,2018 - 01:50 by Z_CLU

ఆగష్టు 3 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది చి.ల.సౌ. సినిమా. టైటిల్ తోనే బ్యూటిఫుల్ లవ్ ఎంటర్ టైనర్ అనే మార్క్ క్రియేట్ చేసిన ఈ సినిమా, ట్రైలర్ తో ఇంప్రెస్ చేయడంలో  సక్సెస్ అయింది. సుశాంత్ హీరోగా నటించిన ఈ సినిమాతో, ఇప్పటి వరకు హీరోగా ఎంటర్టైన్ చేసిన రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఈ సందర్భంగా సుశాంత్ ఈ సినిమా జర్నీ గురించి మీడియాతో డిస్కస్ చేశాడు. ఆ విషయాలు మీకోసం…   

 

వెన్నెల కిషోర్ టైటిల్…

సినిమాకి బిగినింగ్ లో చి.అర్జున్ అనే టైటిల్ అనుకున్నాం.  అంతలో రీసెంట్ హిట్ అర్జున్ రెడ్డి తరవాత డెసిషన్ మార్చుకున్నాం. మళ్ళీ అర్జున్ అనగానే అంతే పవర్ ఫుల్ క్యారెక్టర్ ఎక్స్ పెక్ట్ చేస్తారేమోనని ఈ టైటిల్ ఫిక్సయ్యాం. ఈ టైటిల్ వెన్నెల కిషోర్ సజెస్ట్ చేశాడు.

ఈ సినిమా తరవాతే ఏదైనా…

గతంలో కూడా డిఫెరెంట్ సినిమాలు చేయాలి అనుకునే వాడిని. కానీ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది నాపై. కానీ ఫస్ట్ టైమ సొంతంగా నిర్ణయం తీసుకున్నాను. ఈ సినిమా తరవాత ఆడియెన్స్ నన్ను నమ్ముతారు అనే అనుకుంటున్నాను.

 

మామయ్య కూడా అదే చెప్పాడు…

మామయ్య కూడా ఎప్పుడైతే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటావో అప్పుడే నీ పొటెన్షియల్ నీకు తెలుస్తుంది  అన్నారు . అందుకే ఎప్పుడైతే రాహుల్ నాకు ఈ స్టోరీ చెప్పాడో, నాకు కరెక్ట్ అనిపించగానే ఇమ్మీడియట్ గా డెసిషన్ తీసుకున్నాను.

 

అలా జరిగింది…

స్టోరీ ఓకె అనుకున్నాక సినిమా బయట ప్రొడ్యూసర్స్ తో చేయాలన్న నిర్ణయం రాహుల్ దే. అలా సిరుని సినీ కార్పొరేషన్ ని అప్రోచ్ అవ్వడం జరిగింది.

అది నాకు బెస్ట్ మూమెంట్…

నాగచైతన్య సినిమా చూశాక, ఇంకేమైనా సజెషన్స్ కోసమన్నట్టు మావయ్యకు చూపిస్తే, మావయ్య చాలా ఇంప్రెస్ అయిపోయి, ప్రొడ్యూసర్స్ తో మాట్లాడటం,  పార్ట్ నర్ అవ్వడం జరిగింది. నా లైఫ్ లో ఫస్ట్ టైమ్ నేను డెసిషన్ తీసుకుని చేసిన మావయ్యకి అంతలా నచ్చడం అనేది నిజంగా చాలా పెద్ద అచీవ్ మెంట్.

అసలు కథ ఇది కాదు…

రాహుల్ ఈ కథ కన్నా ముందు నాకు ఇంకో కథ చెప్పాడు. నాకు ఫస్ట్ కథ కన్నా ఇదే నచ్చి చేసేద్దామని చెప్పా… రాహుల్ కి డైరెక్టర్ గా ఎక్స్ పీరియన్స్ లేకపోయినా, హీరోగా  చేసి ఉన్నాడు కాబట్టి ఫిలిమ్  మేకింగ్ లో మంచి నాలెడ్జ్ ఉంది.

 

నో మేకప్ నథింగ్…

నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలకు ఈ సినిమాకు డిఫెరెన్స్ ఏంటంటే…  సినిమాలో ఏ మాత్రం హీరోయిజం లేకుండా  చాలా న్యాచురల్ గా కనిపిస్తా.. ఈ సినిమాలో కనీసం మేకప్ కూడా వేసుకోలేదు…

 

రుహానీ శర్మ గురించి…

రుహానీకి సినిమా గురించి తప్ప ఇంకో ఆలోచన ఉండదు. సినిమా సెట్స్ పైకి రాకముందే 2 రోజులు వర్క్ షాప్ చేశాం. ఆ తరవాత సెట్స్ లో కూడా చాలా ఆక్టివ్ గా ఉంటుంది.

 

వెరీ షార్ట్ టైమ్ లో…

సినిమా మ్యాగ్జిమం నైట్స్ లో షూట్ చేశాం. 32 రోజుల్లో షూట్ కంప్లీట్ చేశాం.