Surya Tollywood - ఈసారి డెబ్యూ పక్కా?

Sunday,June 20,2021 - 11:48 by Z_CLU

టాలీవుడ్ లో ఓ స్ట్రయిట్ మూవీ చేస్తానని చాన్నాళ్లుగా చెబుతున్నాడు సూర్య. కానీ అతడి మార్కెట్ వాల్యూ, ఇతర పరిస్థితుల వల్ల ఇప్పటివరకు అది సాధ్యం కాలేదు. ఈ గ్యాప్ లో సూర్య తమ్ముడు కార్తి మాత్రం టాలీవుడ్ లో డెబ్యూ ఇచ్చేశాడు. అయితే ఈసారి మాత్రం సూర్య టాలీవుడ్ పై సీరియస్ గా దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఓ స్ట్రయిట్ తెలుగు సినిమా కోసం సూర్య ప్రయత్నిస్తున్నట్టు టాక్.

boyapati zeecinemalu

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, దర్శకుడు బోయపాటి శ్రీనుతో సూర్య చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మాస్ సినిమాలకు పెట్టింది పేరు బోయపాటి. సూర్యకు ఎలాగూ మాస్ ఇమేజ్ ఉంది. కాబట్టి వీళ్లిద్దరి కాంబోలో సినిమా కచ్చితంగా ప్రామిసింగ్ ప్రాజెక్ట్ అవుతుంది.

trivikram

మరోవైపు దర్శకుడు త్రివిక్రమ్ తో కూడా సూర్య టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమాలన్నీ క్లాస్ గా ఉంటాయి. సూర్యకు ఇక్కడ కూడా అడ్వాంటేజ్ ఉంది మరి. ఆయన ఎంత మాస్ గా కనిపిస్తాడో అంతే క్లాస్ గా కూడా కనిపించగలడు. సో.. ఈ కాంబినేషన్ ను కూడా కొట్టిపారేయలేం.

తన తొలి తెలుగు సినిమాతో సూర్య క్లాస్ గా కనిపిస్తాడా.. మాస్ గా కనిపిస్తాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మరోవైపు తెలుగు ఆడియన్స్ లో తనకున్న ఇమేజ్ ను కూడా సూర్య దృష్టిలో పెట్టుకుంటే మంచిది. సూర్య నుంచి ఓ సినిమా వచ్చిందంటే అది కచ్చితంగా కొత్తగా ఉంటుందనే ఇమేజ్ ఉంది. ఆ కొత్తదనం మిస్ అవ్వకుండా సూర్య తన తొలి తెలుగు సినిమాను ఎంచుకోవాల్సి ఉంటుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics