వెంకీ సినిమాలో సూర్య?

Friday,August 17,2018 - 12:18 by Z_CLU

ప్రస్తుతం వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్-2 అనే మల్టీస్టారర్ చేస్తున్నాడు వెంకటేష్. ఈ మూవీ తర్వాత మేనల్లుడు నాగచైతన్యతో కలిసి వెంకీ మామ మల్టీస్టారర్ చేయబోతున్నాడు. ఇప్పుడీ రెండు సినిమాలతో పాటు ముచ్చటగా మూడో మల్టీస్టారర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విక్టరీ వెంకటేష్.

రీసెంట్ గా వెంకటేష్ కు ఓ మల్టీస్టారర్ స్టోరీ వినిపించాడు కథ-మాటల రచయిత ప్రసన్నకుమార్ బెజవాడ. స్టోరీలైన్ వెంకటేష్ కు నచ్చింది. ప్రస్తుతం పూర్తిస్థాయి స్క్రీన్ ప్లే రాసే పనిలో ప్రసన్నకుమార్ బిజీగా ఉన్నాడు. త్రినాధరావు దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా వచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో ఓ కీలక పాత్ర కోసం సూర్యను అనుకుంటున్నారు.

కథ ప్రకారం సూర్య అయితే ఈ సినిమాకు సరిగ్గా సరిపోతాడని యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాలో పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు వెంకీ.