ఎక్స్ క్లూజివ్: సుధా కొంగర దర్శకత్వంలో సూర్య

Tuesday,July 17,2018 - 01:42 by Z_CLU

సాలా ఖదూస్ సినిమాతో ఇండియా మొత్తాన్ని ఎట్రాక్ట్ చేశారు సుధా కొంగర. అదే సినిమాను తెలుగులో గురు పేరిట రీమేక్ చేసి టాలీవుడ్ ఆడియన్స్ కు కూడా దగ్గరయ్యారు. ఇప్పుడీ డైరక్టర్ హీరో సూర్యను టార్గెట్ చేశారు. అతడితో ఓ డిఫరెంట్ మూవీ ప్లాన్ చేశారు.

ప్రస్తుతానికైతే సూర్య, సుధ మధ్య స్టోరీ డిస్కషన్లు జరుగుతున్నాయి. డైరక్టర్ చెప్పిన లైన్ కు సూర్య దాదాపు ఓకే చేసినట్టు టాక్. అందుకే ఆమె లొకేషన్లు కూడా ఫిక్స్ చేసే పనిలో పడ్డారు.

ప్రస్తుతం సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు సూర్య. ఈ మూవీ థియేటర్లలోకి వచ్చిన వెంటనే సుధా కొంగర సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమా కనుక ఓకే అయితే, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సూర్య చేయాల్సిన మూవీ మరింత ఆలస్యం అవుతుంది.