అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సర్ ప్రైజ్

Tuesday,October 02,2018 - 10:03 by Z_CLU

మరికొన్ని గంటల్లో గ్రాండ్ గా జరగనుంది ‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్ ఈవెంట్. అయితే ఈ ఈవెంట్ లో సినిమా యూనిట్ ఇంట్రెస్టింగ్ సర్ ప్రైజెస్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ విషయంలో అఫీషియల్ కన్ఫర్మేషన్ లాంటిది లేదు కానీ, ఈ సినిమా నుండి మరో సాంగ్ ను ఈ ఈవెంట్ లో రిలీజ్ చేస్తారనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది.

ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఇప్పటి వరకు 4 సాంగ్స్ రిలీజయ్యాయి. ‘అనగనగా’ నుండి మొదలైతే, రిలీజైన ప్రతి సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆల్బమ్ లోని 4 పాటల్ని ఒకదాని తరవాత ఒకటి రిలీజ్ చేసిన ఫిలిమ్ మేకర్స్, మరో సాంగ్ ని ఈ రోజు రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది. అయితే ఓ పక్క ఈ ఈవెంట్ ని సెలెబ్రేట్ చేసుకుంటూనే ఈ సినిమా ట్రైలర్ ని రేపు రాత్రి 8:10 లకు సోషల్ మీడియాలో రిలీజ్ చేయనున్నారు సినిమా యూనిట్.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అక్టోబర్ 11 న రిలీజవుతున్న ఈ సినిమా, హారిక & హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.