ఇలియానా ఫ్యాన్స్ కి సరికొత్త సర్ ప్రైజ్

Thursday,November 08,2018 - 01:13 by Z_CLU

నవంబర్ 16 న రిలీజవుతుంది అమర్ అక్బర్ అంటోని. ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు శ్రీను వైట్ల  మార్క్ కామెడీ ఫ్లేవర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ఇలియానా, మంచి పర్ఫామెన్స్ ఓరియంటెడ్ రోల్ లో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఫ్యాన్స్ కి మరో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ కూడా ఉండబోతుంది.

ఈ సినిమాలో ఇలియానా సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. అందునా కేవలం 4 రోజుల్లో డబ్బింగ్ కంప్లీట్ చేసుకుందట. బాలీవుడ్ లో  తనకంటూ స్పెషల్ ప్లేస్ క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయిన ఈ గోవా బ్యూటీ డెడికేషన్ చూస్తుంటే, టాలీవుడ్ లో  మళ్ళీ టాప్ ప్లేస్ ని టార్గెట్ చేసుకున్నట్టే అనిపిస్తుంది.

రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఆడియెన్స్ లో ఉన్న క్యూరియాసిటీ కి తగ్గట్టు భారీగా సినిమాని ప్రమోట్ చేస్తుంది అమర్ అక్బర్ ఆంటోని టీమ్. రేపు ఈ సినిమా జ్యూక్ బాక్స్ ని రిలీజ్ చేయనున్న మేకర్స్, త్వరలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో  పాటు  ట్రైలర్ రిలీజ్ కి సంబంధించిన  డీటేల్స్ అనౌన్స్ చేయనున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాకి శ్రీను వైట్ల డైరెక్టర్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ కి  తమన్ మ్యూజిక్ కంపోజర్.