'రాజా ది గ్రేట్' లో సర్ ప్రైజ్ ఎలిమెంట్?

Thursday,October 12,2017 - 04:32 by Z_CLU

ప్రతి సినిమాలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మేకర్స్ ఎక్కువగా వాటినే హైలెట్ చేయాలని చూస్తారు. కానీ కొన్ని హైలెట్స్ తో పాటు మరికొన్ని సర్ ప్రైజ్ లు కూడా ఉంటాయి. అలాంటివాటిని కావాలనే దాచి పెడతారు. సినిమా చూసిన ప్రేక్షకుడు థ్రిల్ ఫీలవ్వాలనే ఉద్దేశంతో ఇలా చేస్తుంటారు. రవితేజ హీరోగా వస్తున్న రాజా ది గ్రేట్ సినిమాలో కూడా ఇలాంటి సర్ ప్రైజ్ ఎలిమెంట్ ఒకటుంది.

రాజా ది గ్రేట్ సినిమాకు సంబంధించి పాటల్ని ఇప్పటికే మార్కెట్లోకి రిలీజ్ చేశారు. జూక్ బాక్స్ లో మొత్తం 5 పాటలున్నాయి. అయితే లెక్కప్రకారం సినిమాలో 6 పాటలున్నాయట. మరి మిగిలిన ఆ ఒక్క పాట ఏమైంది. అదే సర్ ప్రైజ్ అంటోంది సినిమా యూనిట్.

కేవలం ప్రేక్షకులకు థ్రిల్ కలిగించాలనే ఉద్దేశంతో కావాలని ఆ పాటను విడుదల చేయకుండా దాచామంటున్నారు. సెకెండాఫ్ లో వచ్చే ఆ పాట, ఫుల్ జోష్ తో కామెడీగా ఉంటుందని.. టోటల్ సినిమాకే అది హైలెట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు. చూసిన ప్రతిఒక్కరు ఆ పాటను ఎంజాయ్ చేస్తారట.