బందోబస్త్ డేట్ మారింది

Monday,August 05,2019 - 02:48 by Z_CLU

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్ట్ 30న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ అదే టైమ్ కు సాహో ఫిక్స్ అయింది. తమిళ్ లో ఓకే కానీ, తెలుగులో సాహో ఉండగా, సూర్య సినిమా రావడం కరెక్ట్ కాదు. అందుకే బందోబస్త్ మూవీ రిలీజ్ డేట్ ను టోటల్ గా మార్చేశాను. ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 20కు షిఫ్ట్ అయింది ఈ సినిమా.

అవును.. కేవీ ఆనంద్ డైరక్షన్ లో వస్తున్న బందోబస్త్ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 20న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. బ్రదర్స్ సినిమా తర్వాత సూర్య-కేవీ ఆనంద్ కాంబోలో వస్తున్న మూవీ ఇదే.

సినిమాలో డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు సూర్య. సాయేషా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఆమె రియల్ లైఫ్ భర్త ఆర్య ఓ కీలక పాత్ర పోషించాడు. ఇక విలక్షణ నటుడు మోహన్ లాల్, భారత ప్రధాని పాత్రలో కనిపించబోతున్నారు. హరీష్ జైరాజ్ సంగీతం అందించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.