సూర్య కొత్త సినిమా అప్ డేట్స్

Friday,April 14,2017 - 11:19 by Z_CLU

మొన్నటివరకు సింగం-3తో హల్ చల్ చేసిన సూర్య, షార్ట్ గ్యాప్ లో మరో సినిమా రెడీ చేశాడు. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే 60శాతం పూర్తయింది. త్వరలోనే మూవీకి సంబంధించిన విశేషాలతో ప్రెస్ మీట్ ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నారు.

సూర్య సినిమా అంటే కచ్చితంగా అది తెలుగులో కూడా రిలీజ్ కావాల్సిందే. తెలుగులో ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ కు ఇప్పట్నుంచే క్రేజ్ క్రియేట్ అయింది. టాలీవుడ్ లో సింగం-3 సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రానప్పటికీ.. తాజా సినిమాపై మాత్రం అంచనాలు ఏమాత్రం తగ్గలేదు.

మరోవైపు ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ను దర్శకుడు విఘ్నేష్ శివన్ డిసప్పాయింట్ చేశాడు. సూర్య ఫస్ట్ లుక్ ఇంకా రెడీ కాలేదని ప్రకటించిన విఘ్నేష్.. తన సినిమా కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు థ్యాంక్స్ చెప్పుకొచ్చాడు. సూర్య సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుథ్ సంగీత దర్శకుడు.