సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న ‘గ్యాంగ్’

Saturday,January 13,2018 - 10:57 by Z_CLU

నిన్న రిలీజైన సూర్య ‘గ్యాంగ్’ మొదటి రోజే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను అదే రేంజ్ క్రియేట్ చేసుకున్న సూర్య, తన ‘గ్యాంగ్’ తో ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేయడంలో సక్సీడ్ అయ్యాడు. రమ్యకృష్ణ, కార్తీక్ కీ రోల్ ప్లే చేసిన ఈ సినిమా సంక్రాంతి కి పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ అంటున్నారు మూవీ లవర్స్.

విఘ్నేశ్ శివన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘గ్యాంగ్’ సూర్యని కొత్త ఆంగిల్ లో ప్రెజెంట్ చేయడం సినిమాలో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ అయితే, గ్రిప్పింగ్ థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే తో పాటు ఫుల్ టూ ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ సినిమాని మొదటి రోజే సక్సెస్ ట్రాక్ పై నిలబెట్టాయి. అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో సూర్య సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది..