సూర్య ‘గ్యాంగ్’ కి క్రియేట్ అవుతున్న పాజిటివ్ టాక్

Wednesday,January 10,2018 - 04:52 by Z_CLU

సూర్య ‘గ్యాంగ్’ జనవరి 12 న రిలీజవుతుంది. ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ సీరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ తో ఎంటర్ టైన్ చేసిన సూర్య, ఈ సినిమాలో ఫుల్ టూ ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ తో ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ట్రైలర్ తో ఇంప్రెస్ చేసిన సూర్య  ‘గ్యాంగ్’ పండక్కి పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ అంటున్నారు ఫిల్మ్ మేకర్స్.

సూర్య సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ కీ రోల్ ప్లే చేయడం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అయితే, సూర్య ఫస్ట్ టైమ్ తెలుగులో ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పుకోవడం సినిమాపై మరింత క్యూరాసిటీని జెనెరేట్ చేస్తుంది.

విఘ్నేశ్ శివన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. UV క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు.