'సూర్య' ఎక్స్ క్లూజివ్ ఇంటర్వూ

Monday,February 06,2017 - 03:20 by Z_CLU

పర్యావరణంపైనే ఫోకస్

సింగం-3 కథలో పర్యావరణం మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సింగం-2 లో సౌతాఫ్రికాలో మిషన్-డి హైలెట్ అవుతుంది. ఈ సినిమాలో ఒక మెయిన్ విలన్ ఫ్రం సౌతాఫ్రికా, మన కంట్రీ, మన ఎన్విరాన్ మెంట్… ఈ పాయింట్ పైనే సినిమా నడుస్తుంది.

 

100 డేస్ పోస్ట్ పోన్

సినిమా ఫస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుండి పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. అలా వంద రోజులు మూవీ రిలీజ్ వాయిదా పడింది. కొన్నిసార్లు సినిమా బెటర్ మెంట్ కోసం చేస్తే, కొన్నిసార్లు తమిళనాడులో క్రియేట్ అయిన ఇమోషనల్ మూమెంట్స్ ని మైండ్ లో పెట్టుకుని రిలీజ్ ని పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది.

 

పోలీస్ డిపార్ట్ మెంట్ కే ఇన్ స్పిరేషన్

ఈ సినిమా IPS C.V. ఆనంద్ కూడా చూసి చాలా అప్రీషియేట్ చేశారు. కచ్చితంగా సినిమా కమర్షియల్ ఎంటర్ టైనరే, కానీ చాలావరకు సినిమా పోలీస్ లైఫ్ స్టైల్స్ కి, వాళ్ల రియల్ లైఫ్ ఛాలెంజెస్ కి చాలా దగ్గరగా ఉంటుంది.  ఇప్పటికీ మహారాష్ట్ర లోని కొన్ని పోలీస్ అకాడమీస్ లో పోలీసుల్లో స్ఫూర్తి నింపేందుకు ఈ సినిమా చూపిస్తున్నారు. చాలా హ్యాప్పీగా ఉంది.

 

5 భాషల్లో రిలీజ్

సింగం ఫ్రాంచైజీకి క్రియేట్ అయిన డిమాండ్ బట్టి ఈసారి సినిమాని మొత్తం 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. సినిమా అటు ఫ్యామిలీ ఎమోషన్స్, ఇటు యాక్షన్ సీక్వెన్సెస్ ని బ్యాలెన్స్ చేస్తూ ఎంటర్ టైన్ చేస్తుంది.

surya-25

NTR గారు C.M. గా ఉన్నప్పుడు అలాగే జరిగింది

నిజానికి NTR గారు C.M. గా ఉన్నప్పుడు ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో పోలీస్ ఫోర్స్ అవసరమై, అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి M.G.R గారిని కాంటాక్ట్ చేశారు. అప్పుడు M.G.R. ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయి, పోలీస్ ఫోర్స్ ని పంపారు. ఇలాంటి ఇన్స్ పైరింగ్ స్టోరీస్ తో ఈ సినిమా తెరకెక్కింది.

 

సింగం 4 ఎప్పుడు..?

తెలీదు.. ఎందుకంటే సింగం చేస్తున్నపుడు సింగం 2 గురించి కనీసం ఆలోచించలేదు. సింగం 2 చేస్తున్నప్పుడు సింగం 3 గురించి ఆలోచించలేదు.. సో. సింగం 4 గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేం.

surya-36

నెక్స్ట్ సినిమా…

1980ల నాటి మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయబోతున్నాను. ఆల్రెడీ స్క్రిప్ట్ ఫైనల్ అయింది. నిజానికి ఈ సినిమా, సింగం 3 కన్నా ముందే రావాలి, కానీ ఈ సినిమా పై క్రియేట్ అయిన డిమాండ్ ని బట్టి సింగం 3 తరవాత, ఆ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాం.. దీని తరవాత ఇమ్మీడియట్  గా ఆ సినిమా బిగిన్ అవుతుంది.

శృతిహాసన్ పర్ఫామెన్స్

శృతిహాసన్ కి ఒక్క లాంగ్వేజ్ అని కాదు… మల్టీ లాంగ్వేజెస్ లో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ  ఈ సినిమాలో తన క్యారెక్టర్ ఇంకా ఎక్కువగా రీచ్ అవుతుంది, తన అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్ ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచేస్తుంది.

ఇది చాలా కామన్

మ్యాగ్జిమం తమిళనాడులో ఈ లుక్ చాలా కామన్, డ్రైవర్స్ దగ్గరి నుండి చాలా మంది బిజినెస్ పీపుల్ వరకు అలాంటి మీసం, గెడ్డాన్నే మెయిన్ టైన్ చేస్తుంటారు. సో ఈ లుక్ రీచ్ అవుతుందనే ఫిక్స్ అయ్యాం…

surya-54

120 రోజుల్లోనే పూర్తి చేశాం

సినిమాని 120 రోజుల్లో పూర్తి చేశాం. జనరల్ గా ఏ సినిమాకైనా ఒక రోజులో 30 షాట్స్ తీస్తారు. కానీ డైరెక్టర్ హరి 90 షాట్స్ షూట్ చేసేవారు. కెమెరా డిపార్ట్ మెంట్ కి ఆయన పల్స్  తెలుసు… అంత అక్యురేట్ గా టీం పనిచేసేది..

తెలుగులో డైరెక్ట్ సినిమా ఎప్పుడు..? ఎవరితో..?

డిస్కషన్స్ నడుస్తున్నాయి. అంత ఓకే అయ్యాక అనౌన్స్ చేస్తా. కానీ డెఫ్ఫినేట్ గా ఉంటుంది.