సెట్స్ పైకి వచ్చిన సూర్య కొత్త సినిమా

Monday,January 22,2018 - 04:36 by Z_CLU

సూర్య ‘గ్యాంగ్’ సెట్స్ పై ఉండగానే సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో అనౌన్స్ అయిన సినిమా ఈ రోజు నుండి సెట్స్ పైకి వచ్చేసింది. అల్ట్రా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో సూర్య సరసన సాయి పల్లవితో పాటు రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.

 

యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాని దీపావళి కల్లా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. S.R. ప్రభు, S.R. ప్రకాష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.