దీపావళి కానుకగా వస్తున్న సూర్య సినిమా

Monday,July 23,2018 - 11:33 by Z_CLU

సూర్య కొత్త సినిమా ముస్తాబైంది. దీపావళికి ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. సెల్వరాఘవన్-సూర్య కాంబోలో తెరకెక్కుతున్న ఫస్ట్ మూవీ ఇది. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా పేరు NGK. అంటే నందగోపాలకృష్ణ అని అర్థం.

‘గజిని’, ‘సింగం’ సిరీస్‌ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సంపాదించుకున్న సూర్య, తన 36వ చిత్రంగా ‘NGK’ చేశాడు. సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదల కాగా, సూర్య బర్త్ డే (జులై 23) సందర్భంగా మరో పోస్టర్ విడుదల చేశారు.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతోంది నందగోపాలకృష్ణ మూవీ. రీసెంట్‌గా ‘ఖాకి’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ‘NGK’ (నంద గోపాలకృష్ణ) చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.