Suresh Productions - కొత్త వాళ్ళతో సినిమా!

Wednesday,June 02,2021 - 01:42 by Z_CLU

ప్రస్తుతం అగ్ర నిర్మాతలు సైతం కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ కాన్సెప్ట్ సినిమాలు నిర్మించడానికి సిద్దంగా ఉన్నారు. ఇక దిల్ రాజు లాంటి నిర్మాతలు మొదటి నుండే కొత్త దర్శకులకు పెద్ద పీట వేస్తూ సినిమాలు నిర్మించారు. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ కూడా ఆ దారిలోనే నడబోతుంది. ఇప్పటికే కొంత మంది కొత్త దర్శకుల సినిమాలను , కాన్సెప్ట్ సినిమాలను సమర్పిస్తున్న ఈ సంస్థ త్వరలోనే కొత్త దర్శకులతో సినిమాలు నిర్మించేందుకు రెడీ అవుతుంది.

 

రామానాయుడు ఫిలిం ఇన్స్టిట్యూట్ నుండి కొందరు దర్శకులను పరిచయం చేయనున్నారట నిర్మాత సురేష్ బాబు. వారిలో ముందుగా సతీష్ అనే కుర్రాడితో ఓ సినిమా నిర్మించబోతున్నారని సమాచారం. ఇటివలే సురేష్ బాబు కి ఓ స్క్రిప్ట్ చెప్పి మెప్పించాడట సతీష్. ఐడియాతో పాటు స్క్రీన్ ప్లే కూడా నచ్చడంతో వెంటనే ఈ కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని తెలుస్తుంది.

ramanaidu film school zeecinemalu

ఈ సినిమాలో రామానాయుడు ఫిలిం ఇన్స్టిట్యూట్ నుండి కొందరు కొత్త నటీ నటులు కూడా పరిచయం అవ్వనున్నారట. తమ స్టూడెంట్స్ న్ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసేందుకు సురేష్ బాబు ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. అయితే హీరో హీరోయిన్స్ ని కూడా అందులో నుంచే సెలెక్ట్ చేస్తారా ? లేదా ప్రేక్షకులకు పరిచయం ఉన్న హీరో హీరోయిన్స్ తీసుకుంటారా ? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా సురేష్ బాబు తమ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ సినిమా చేస్తుండటం విశేషమే. మరి ఈ సినిమా సక్సెస్ అయితే రామానాయుడు ఫిలిం ఇన్స్టిట్యూట్ నుండి మరింత మంది కొత్త దర్శకులకు అవకాశం వస్తుందనడంలో సందేహం లేదు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని డీటెయిల్స్ ఎనౌన్స్ చేసి షూటింగ్స్ కి పర్మీషణ్ రాగానే సెట్స్ పైకి తీసుకెళ్తారట సురేష్ బాబు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics