అందుకే సినిమాలో భాగం అయ్యాను -సురేష్ బాబు

Saturday,July 23,2016 - 04:25 by Z_CLU

విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా ధర్మపథ క్రియేషన్స్, బిగ్ బెన్ స్టూడియోస్ బ్యానర్ పై రాజ్ కందుకూరి, యాష్ రంగినేని నిర్మాతలుగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పెళ్లి చూపులు’. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు సమర్పిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో ముచ్చటించారు..

 

సినిమా బాగా నచ్చింది అందుకే…

ముందుగా పెళ్లి చూపులు కథ ను తరుణ్ భాస్కర్ నాకు చెప్పడం జరిగింది. అయితే రెండో భాగం లో కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఆ తరువాత రాజ్ కందుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారని చెప్పారు. ఇక ప్రారంభం రోజు తో పాటు ఇటీవలే ఆడియో వేడుకకు కూడా హాజారు కావడం జరిగింది. ఇక తాజాగా సినిమా చూసాను బాగా నచ్చింది. అందుకే ఓ మంచి సినిమాలో భాగం అయ్యి సినిమా కు సపోర్ట్ అందించాలన్న ఉద్ద్యేశ్యం తోనే ఈ సినిమాను సమర్పిస్తున్నాను.

 

టీం వర్క్ బాగా నచ్చింది…

ఇక తాజాగా యువత చిన్న సినిమాలతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు కానీ అందరు విజయం అందుకోలేక పోతున్నారు. అయితే వారి కున్న బడ్జెట్ లో వారి కేమి ఉన్న విజన్ తో మంచి ప్లానింగ్ తో ఈ సినిమాను రూపొందించారు యూనిట్. ఈ సినిమాకు సింక్ సౌండింగ్ వాడారు. అన్ని విషయాలలో చాలా జాగ్రత్త వహించి తెరకెక్కించారు. ముఖ్యంగా టీం వర్క్ బాగా నచ్చింది. ఈ సందర్భంగా టీం అందరికీ నా అల్ ది బెస్ట్.

నాకు చాలా సిగ్గు ...

ఈ సినిమా చూసినప్పుడు నా పెళ్లి చూపులు గుర్తొచ్చాయి. సాధారణంగా నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. మా భార్య ను పెళ్లి కి ముందు ఓ మూడు సార్లు మా చుట్టాలింట్లో కలిసాను కానీ ఒక్క ముక్క కూడా మాట్లాడలేకపోయాను. అలాగే ఈ సినిమా చూస్తున్నప్పుడు పెళ్ళైన వారికి వారి పెళ్లి చూపులు ఖచ్చితంగా గుర్తొస్తాయి.

 

ఆ వార్తల్లో నిజం లేదు అవన్నీ రూమర్స్..

మా అబ్బాయి అభిరామ్ హీరో అవుతున్నాడంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. అయితే ఇప్పటి వరకూ అభిరామ్ తో కలిసి ఇంకా సరైన డిసిషన్ తీసుకోలేదు. వాడికి ఇంట్రెస్ట్ ఉంది. కానీ దాని గురించి అసలు ఇంకా ఆలోచించలేదు. ఇక ఇప్పటి వరకూ మా అభిరామ్ హీరో అవుతున్నాడని వస్తున్న వార్తల్లో నిజం లేదు అవన్నీ రూమర్స్ మాత్రమే.

 

మంచి సినిమాగా నిలుస్తుందని భావిస్తున్నా..

పెళ్లి చూపులు ఈ శుక్ర వారం థియేటర్స్ లో విడుదల కానుంది. ఖచ్చితంగా అందరికీ నచ్చి ఒక మంచి సినిమాగా నిలుస్తుందని భావిస్తున్నా.

 

త్వరలోనే మూడు సినిమాలు ప్లాన్ చేస్తున్నా..

నాన్న గారు కాలం చేసాక మా బ్యానర్ లో ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే మా నిర్మాణం లో ప్రేక్షకులకు మంచి సినిమా చూపించాలనే ఉద్ద్యేశ్యం తోనే కాస్త సమయం తీసుకుంటున్నాం. ఇక వెంకటేష్, రానా కాంబినేషన్ లో ఓ కథ సిద్ధం అవుతుంది. అలాగే చైతు తో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాం. ఇక పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వం లో ఓ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం.